ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం నియోజకవర్గంలో నమోదైన కొవిడ్ కేసులు, మృతిచెందిన వారి వివరాలు, కంటైన్మెంట్ జోన్ల వివరాలు మంత్రి సురేశ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టణంలో వ్యాపారాలు పూర్తిగా స్తంభించాయని.. ఈ సమస్యకు పరిష్కారం చూపాలని వ్యాపారులు మంత్రిని కోరారు. దీనిపై అధికారులతో చర్చించిన మంత్రి.. వ్యాపారం చేసుకునేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని సూచించారు. కేసుల సంఖ్యను కట్టడిచేసే విషయంలో కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు. పలు గ్రామాల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.
ఇవీ చదవండి..