కరోనా మహమ్మారి నియంత్రణ కోసం రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తోందని.. విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో ఇమ్మడిశెట్టి నారాయణమ్మ, ఈశ్వరమ్మ ఛారిట్రబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సమకూర్చిన నిత్యావసరాలను మంత్రి పేదలకు పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ ప్రభుత్వ నిబంధనలు పాటించాలని.. సరైన జాగ్రత్తలు పాటిస్తూ కొవిడ్‌ను తరిమికొట్టాలని సూచించారు. లాక్డౌన్ కారణంగా ఇబ్బందులు పడుతున్న రోజువారీ కూలీలు, పేదలను ఆదుకునేందుకు దాతలు ముందుకు రావాలని కోరారు.
ఇవీ చదవండి.. గిరిపుత్రులను వెంటాడుతున్న కరోనా భయం