MEDICAL COLLEGE: ప్రకాశం జిల్లాలో వెనుకబడిన ప్రాంతాలైన యర్రగొండపాలెం, గిద్దలూరు, మార్కాపురం, కనిగిరి నియోజకవర్గాల ప్రజలు... విద్యా, వైద్య అవసరాల కోసం కర్నూలు, గుంటూరు, ఒంగోలు ప్రాంతాలకు రావాల్సిందే. ప్రధానంగా వైద్యం కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మార్కాపురంలోని .. జిల్లా వైద్యశాలలో వసతులు, పూర్తిస్థాయి వైద్య సిబ్బంది లేకపోవటంతో.. అత్యవసర పరిస్థితుల్లో ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్కాపురంలో వైద్య కళాశాల మంజూరు చేసింది.
రాయవరం వద్ద దాదాపు 50 ఎకరాల స్థలాన్ని సేకరించి వైద్య కళాశాల, కిడ్నీ రీసెర్చ్ సెంటర్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం 500 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించింది. గత ఏడాది మే31న మంత్రుల చేతులు మీదుగా శంకుస్థాపన చేశారు. గుత్తేదారు సంస్థకు నిర్మాణ పనులు కూడా అప్పగించారు. కానీ, పనులు మాత్రం ఇంకా ప్రారంభ దశ దాటలేదు. మెడికల్ కళాశాల నిర్మాణ పనుల వేగం పెంచి, కళాశాల పూర్తి చేసి..అందుబాటులోకి తేవాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: