చదువుతోపాటు ఉపాధి మార్గాలవైపు దృష్టి సారిస్తే... కళాశాల నుంచి బయటకు వచ్చిన తరువాత మంచి భవిష్యత్తు పొందవచ్చనే దిశగా విద్యార్థులను తయారు చేస్తున్నారు వీఆర్ఎస్ ఇంజినీరింగ్ కళాశాల అధ్యాపకులు. కళాశాలకు అవసరమైన బల్లలు, కుర్చీలు, స్టూళ్లు ఇక్కడి విద్యార్థులే తయారుచేయడం విశేషం. జీవన నైపుణ్యం పెంపులో భాగంగా గతేడాది అక్టోబర్‌లో ఇంటర్న్షిప్ తీసుకున్న విద్యార్థులు వీటన్నిటిపై శిక్షణ పొందారని అధ్యాపకులు తెలిపారు.
కళాశాలలో ఉన్నప్పుడే వీటిపై పట్టుసాధించినందుకు విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో తాము సొంతగా పరిశ్రమలు ఏర్పాటు చేసి పది మందికి ఉపాధి కల్పించగల నమ్మకం ఉందని చెబుతున్నారు. కళాశాల యాజమాన్యం సహకారం... నేర్చుకోవాలని తపన ఆ విద్యార్థులను ఈ రంగంలో నిష్ణాతులను చేసింది.
ఇదీ చూడండి: