ప్రకాశం జిల్లా మార్టూరు మండలంలో అకస్మాత్తుగా కురిసిన వర్షాలు.. ప్రజలకు భయభ్రాంతులు కలిగించాయి. గన్నవరంలో ఓ చెట్టుమీద పిడుగుపడటంతో అది దహనమైంది. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. పునూరు గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రం వద్ద ఆరబోసిన మక్కలు.. తడిచిపోతాయని రైతులు ఆందోళన చెందారు.
తడవకుండా పట్టాలు కప్పారు. నాగరాజుపల్లిలో ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. ఈ గాలులకు వేప చెట్టు విరిగి రహదారికి అడ్డంగా పడింది. విద్యుత్ తీగలు తెగిపోయి సరఫరా నిలిచిపోయింది. స్పందించిన అధికారులు, గ్రామస్థులు ట్రాక్టర్ ద్వారా రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును తొలగించారు. సిబ్బంది విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు.
ఇదీ చదవండి: