రాష్ట్రంలోనే ఉలవపాడు మామిడికి ఓ ప్రత్యేకత ఉంది.. రుచి, సువాసనతో ఉన్న ఈ మామిడిని సీజన్‌లో ఒక్కసారైనా తినాలనిపిస్తుంది. సుదూర ప్రాంతాలకు ఈ మామిడి ఎగుమతి అవుతుంది.. అయితే ఈ ఏడాది మాత్రం పరిస్థితి తారుమారైంది. వర్షాభావ పరిస్థితులతో దిగుబడి పడిపోయింది.
ప్రకాశం జిల్లాలోని ఉలవపాడు ప్రాంతంలో పండించే మామిడికి ప్రత్యేకమైన రుచి ఉంటుంది. ఈ మామిడి పండ్లు తెలుగురాష్ట్రాల్లోనే కాకుండా, తమిళనాడు, కర్ణాటకకు కూడా ఎగుమతి అవుతాయి. బంగనిపల్లి, తూతాపూరి వంటి రకాలైన మామిడి ఉలవపాడు, గుడ్లూరు మండలాల్లో వేలాది ఎకరాల్లో పండిస్తారు. పండు పక్వానికి వచ్చేంత వరకూ.. చెట్టు పైనే ఉంచి, తరువాత కోత కోస్తారు. మగ్గపెట్టేందుకు రసాయనాలు వినియోగించరు. దీని వల్ల ఈ ప్రాంత మామిడికి బ్రాండ్ ఇమేజ్ ఉంది.
అయితే ఈ ఏడాది మామిడి ప్రియులను ఉలవపాడు నిరుత్సాహపరుస్తోంది. తీవ్ర వర్షాభావ పరిస్థితులు కారణంగా దిగుబడి లేదు. చాలా తోటల్లో అసలు కాపే కనిపించడం లేదు. కాసిన కాయలు చిన్న పరిమాణంతో ఉండి రైతుకు పెట్టుబడి డబ్బులూ వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మెుత్తం ఉలవపాడులో 5 శాతానికి మించి కాపు లేదు. గతంలో జాతీయ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున దుకాణాలు పెట్టి మరీ మామిడిపండ్లు విక్రయించేవారు. ఇప్పుడు ఆ దుకాణాలన్నీ వెలవెలపోతున్నాయి.
నూజివీడు వంటి ప్రాంతాల నుంచి మామిడిని తీసుకువచ్చి వ్యాపారాలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. మామిడి తోటల్ని లీజుకు తీసుకున్నవారూ తీవ్రంగా నష్టపోయారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ట్యాంకర్లతో నీటిని తీసుకువచ్చి చెట్లకు అందిస్తున్నారు. కనీసం చెట్టునైనా బతికించుకోవాలనే ఉద్దేశంతో నీటిని అందిస్తున్నామని రైతులు చెబుతున్నారు.
మామిడి పండ్లకు కేరాఫ్ ఉలవపాడు.. కానీ..!
మామిడి పండ్ల సీజన్ అనగానే గుర్తొచ్చేది ఉలవపాడు. ఏటా వేసవిలో మామిడి దిగుమతి వచ్చే సరికి ఇక్కడ పెద్ద ఎత్తున మార్కెట్ జరుగుతుంది. ఉలవపాడు పేరు చెప్పి మరీ కొంతమంది మామిడి పండ్లు అమ్ముకునే వాళ్లు. అంత డిమాండ్ ఇక్కడి పండ్లకు. కానీ ఈసారి ఇక్కడి మామిడిని రుచి చూసే అవకాశం కనిపించడం లేదు..!