ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడు నేషనల్ జాతీయ రహదారి ఐషర్ షోరూం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఏడుగుండ్లపాడు గ్రామానికి చెందిన చినిగే వెంకటేశ్వర్లు ప్రైవేట్ గౌడౌన్లో వాచ్మెన్గా పని చేస్తున్నాడు. రాత్రి పనికి వెళ్లే సమయంలో ఒగోలు నుంచి మద్దిపాడు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీ కొనటంతో వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని పూర్తి వివరాలు సేకరిస్తున్నారు. ఎస్ఐ ఫిరోజ్ ఫాతిమా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి - మద్దిపాడులో రోడ్డు ప్రమాదం వార్తలు
ఏడుగుండ్లపాడు నేషనల్ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని...ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం ఏడుగుండ్లపాడులో జరిగింది.