పిల్లలు లేకపోవడానికి తోడు.. భార్యతో జరిగిన గొడవ కారణంగా మనస్థాపానికి గురైన.. ప్రకాశం జిల్లా కొరిసపాడు మండలం తిమ్మానపాలెంవాసి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన జనావత్ రవి అనే వ్యక్తికి.. తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాకు చెందిన మౌనిక అనే యువతితో ఏడాది క్రితం వివాహం జరిగింది. అయితే ఏడాది నుంచి పిల్లలు లేరని.. ఆసుపత్రిలో చూపించుకుందామని భార్యను అడిగాడు.
మరుసటి రోజు ఆసుపత్రికి వెళదామని ఆమె బదులిచ్చింది. ఆ సందర్భంలో.. జరిగిన వాగ్వాదానికి తోడు.. అప్పటికే పిల్లలు లేరన్న ఆవేదనతో ఉన్న రవి.. ఉద్వేగానికి గురయ్యాడు. ఛాతి ఎడమ వైపున కత్తితో పొడుచుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు.. ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రవి లారీ డ్రైవర్గా పని చేస్తున్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు.
ఇదీ చదవండి:
Road Accident: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి