ETV Bharat / state

అసోం దంపతులపై వ్యక్తి దాడి.. భర్త మృతి - crime at korispadu

ప్రకాశం జిల్లా కొరిశ పాడు మండలం సీతానగర్ కాలనీలో అసోం దంపతులపై ఆదే రాష్ట్రానికి చెందిన వ్యక్తి దాడి చేశాడు. ఈ ఘటనలో భర్త మరణించాడు.

man attacked on assam coples at prakasham district
అస్సాం దంపతులపై వ్యక్తి దాడి.. భర్త మృతి
author img

By

Published : Sep 1, 2020, 8:12 AM IST

Updated : Sep 1, 2020, 5:30 PM IST

ప్రకాశం జిల్లా కొరిశ పాడు మండలం సీతానగర్ కాలనీలో దారుణం చోటు చేసుకుంది. అసోంకు చెందిన దంపతులు రుబుల్ అలీ, స్వప్న కుమారి పై అదే రాష్ట్రానికి చెందిన రాజీవ్ అలీ అనే యువకుడు ఇనుపరాడ్డుతో దాడి చేశాడు. ఈ ఘటనలో రుబుల్ అలీ అక్కడికక్కడే మృతి చెందగా స్వప్న కుమారికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితురాలిని ఒంగోలు రిమ్స్ కి తరలించారు.

రాజీవ్ అలీ నాలుగు రోజుల నుంచి రుబుల్ అలీ ఇంట్లో ఉంటున్నాడు. ఇద్దరూ మద్యం సేవిస్తున్న సమయంలో తన భార్యతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని.. ఇంట్లో నుంచి వెళ్లిపోవాలని రుబుల్ అలీ ఆదేశించాడు. దీంతో రాజీవ్ అలీ ఆగ్రహం చెంది వారిపై దాడి చేసినట్లు స్వప్న కుమారి చెబుతోంది.

ఘటనా స్థలాన్నీ అద్దంకి సీఐ ఆంజనేయరెడ్డి పరిశీలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామాకు అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ఇవాళ కడప జిల్లాకు ముఖ్యమంత్రి జగన్

Last Updated : Sep 1, 2020, 5:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.