కొత్తపల్లి రాష్ట్రీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రకాశం జిల్లా చిన్న కొత్తపల్లి రాష్ట్రీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలో ఇరుక్కుపోయిన క్లీనర్‌ను స్థానికులు బయటకు తీశారు. అతడితో పాటుగాయాలపాలైన డ్రైవర్‌ను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇవీ చూడండి.
ప్రకాశం బరిలో నిలిచింది ఎవరో తెలుసా!