కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు ప్రకాశం జిల్లాలో లాక్డౌన్ కార్యక్రమం కొనసాగుతోంది. ప్రజలు ఎవరూ బయటకి రాకుండా పోలీసులు, అధికారులు పర్యవేక్షిస్తున్నారు.
రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవు
ప్రకాశం జిల్లా చీరాలలో లాక్డౌన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో జనసంచారంపై పోలీసులు ఆంక్షలు తీవ్రం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా బయటకు వస్తే పోలీసులు లాఠీలు ఝుళిపిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప రోడ్లపైకి వస్తే కఠిన చర్యలు తప్పవంటూ పోలీసులు హెచ్చరించారు.
అత్యవసరమైతే తప్ప బయటకు రావోద్దు
లాక్డౌన్ కార్యక్రమంలో భాగంగా గిద్దలూరులో పూర్తిస్థాయిలో 144 సెక్షన్ విధించారు. రోడ్లపైకి ఎవరూ రావడం లేదు. ఫలితంగా.. పట్టణమంతా నిర్మానుష్యంగా మారింది.
కరోనా నియంత్రణకు మృత్యుంజయ హోమం
కరోనా వ్యాప్తి నియంత్రణకు ప్రకాశం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ సింగరకొండ ప్రసన్నంజనేయ స్వామి దేవస్థానం వేద పండితులు మృత్యుంజయ హోమం నిర్వహించారు. దేవస్థాన ఆవరణలో 11 మంది ఋత్విక్కులు మృత్యుంజయ, అరుణ హోమం చేపట్టారు. లోక శాంతికి ఈ హోమం చేస్తున్నట్లు తెలిపారు.
గ్రామంలోకి రాకుండా బారికేడ్లు
కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చిన గంజాం మండలం సోపిరాల గ్రామస్థులు.. పోలీసుల మద్దతుతో స్వచ్ఛందంగా బారికేడ్లు ఏర్పాటు చేసుకున్నారు. ఎవరూ ఊరి నుంచి బయటకు వెళ్లకుండా, ఇతరులు గ్రామంలోకి రాకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
లాక్డౌన్ ముగిసేంత వరకూ ఎవరూ రావొద్దు
పెద్దారవీడు మండలం సుంకేసుల గ్రామస్థులు తమ ఊర్లోకి ఎవరూ రాకుండా ముళ్లకంచె అడ్డు వేశారు. లాక్డౌన్ ముగిసేంత వరకు ఎవరూ రావొద్దని చెబుతున్నారు. తాము గ్రామం నుంచి బయటకు వెళ్లబోమంటూ రహదారికి ముళ్ల కంచె అడ్డువేశారు.
ఇదీ చూడండి: