లాక్ డౌన్ సడలింపుల విషయంలో స్పష్టత కొరవడిన కారణంగా ప్రకాశం జిల్లా చీరాలలో అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం ఇచ్చిన వెసులుబాట్లతో ఇంకొల్లు, పర్చూరు, బాపట్ల తదితర ప్రాంతాల్లో కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతున్నాయి. కార్మికులు, కూలీలు పనులు చేసుకుంటున్నారు. చీరాలలో మాత్రం పరిస్దితి భిన్నంగా ఉందని అక్కడి ప్రజలంటున్నారు.
గతంలో చీరాల పట్టణ పరిధిలో ఒక పాజిటివ్ కేసు నమోదైంది. బాధిత వ్యక్తి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అనంతరం కొత్త కేసులేమీ నమోదు కాలేదు. అయినప్పటికీ చీరాల పరిధిలో సడలింపులు లేవని వ్యాపారులు, పట్టణ వాసులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వచ్చే వరకు సడలింపులకు ఎలాంటి అవకాశాలు లేవని స్థానిక అధికారులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: