ప్రకాశం జిల్లా దోర్నాల మండలం పెద్దమంతనాల సమీపంలో గల కర్నూలు- గుంటూరు రహదారిలో గురువారం రాత్రి గుర్తుతెలియని వాహనం ఢీకొని చిరుత మృతి చెందింది. మూడేళ్లలో రెండు చిలుకలు ఇలాంటి ప్రమాదంలోనే మృత్యువాత పడగా... మరొకటి విష ప్రయోగం వల్ల ప్రాణాలు విడిచింది. మూడు నెలల్లో రెండు దుప్పిలు రహదారి ప్రమాదంలో విగతజీవులుగా మారాయి.
రాష్ట్రంలోని కర్నూలు, ప్రకాశం, గుంటూరు.. తెలంగాణలోని మహబూబ్ నగర్, నల్గొండ జిల్లాలో నల్లమల అడవులు 5838 చ.కి.మీ మేర విస్తరించి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ పులుల అభయారణ్యం 1401.72 చ. కి. మీ కాగా మార్కాపురం డివిజన్ పరిధిలోని ఇది 990 గా ఉంది. దీనిలో రెండు రాష్ట్రాలను కలుపుతూ శ్రీశైలానికి ఉన్న రహదారుల్లో నిత్యం వందలాది వాహనాలు ప్రయాణిస్తుంటాయి. రాత్రి వేళ వీటి రాకపోకలకు అనుమతి లేదు. చోదకులు అతి వేగంగా వాహనాలు నడుపుతున్న సమయంలో వన్య ప్రాణులు ప్రమాదాలకు గురవుతున్నాయి.
ఇదీ చూడండి: వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు మృతి