కొత్త లారీని అప్పగించేందుకు వెళ్తుండగా...
ప్రకాశం జిల్లా అద్దంకి మండలం వెంకటాపురం వద్ద జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకరు మృతిచెందారు. చెన్నై నుంచి ఒడిశాకు కొత్త లారీని డెలివరీ ఇచ్చేందుకు వెళ్తుండగా వెంకటాపురం వద్ద డివైడర్ను లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్ శివకుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు.
ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా...
ప్రకాశం జిల్లా ముప్పవరం రహదారిపై లారీని ఢీకొని యువకుడు మృతిచెందాడు. మృతుడు బల్లికురవ మండలం నక్కబొక్కలపాడుకు చెందిన ఒంగోల్ సురేష్‌గా గుర్తించారు. 2 ప్రమాదాల్లో మృతి చెందిన ఇద్దరి మృతదేహాలను పంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈ జాతీయ రహదారి సమీపంలో అత్యవసర విమాన ల్యాండింగ్‌కు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. రహదారిని తాత్కాలికంగా వన్‌వేగా మార్చినా... ఎటువంటి హెచ్చరిక బోర్డులు పెట్టలేదు. అందుకే తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: ద్విచక్రవాహనాన్ని ఢీ కొన్న లారీ.. ఒకరు మృతి