ETV Bharat / state

తప్పు వారిది... శిక్ష వీరికి!

సొంత స్థలాలు అన్యాక్రాంతమైనా పట్టించుకోని దేవాదాయశాఖ అధికారులు.. రైతుల భూములు మాత్రం తమవిగా నమోదు చేసుకొని అన్నదాతలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీంతో సొంత భూములైనప్పటికీ రిజిస్ట్రేషన్ జరగడం లేదు. సమస్య పరిష్కారం కోసం రైతులు కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది.

author img

By

Published : Jan 24, 2021, 7:44 PM IST

Alienation of lands
తప్పు వారిది... శిక్ష వీరికి!

పర్చూరులో తమ శాఖకు చెందిన స్థలాలు అన్యాక్రాంతమైనా పట్టించుకోని దేవాదాయశాఖ అధికారులు.. ప్రైవేటు వ్యక్తుల భూములను మాత్రం తమవిగా చూపడంతో పలు చిక్కులు తలెత్తుతున్నాయి. తప్పు వారు చేసినా.. సమస్య పరిష్కారం కోసం రైతులు ఆయా కార్యాలయాల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సి వస్తోంది. సొంత భూములైనప్పటికీ రిజిష్ట్రేషన్లు జరగడంలేదు. ఈసీల్లో దేవాదాయ భూమిగా రావడంతో బ్యాంకు రుణాలు సైతం పొందలేని పరిస్థితి. చివరకు పిల్లల వివాహాలు, చదువులు, ఇతర కుటుంబ అవసరాలకు సైతం పొలం విక్రయించుకోలేని దుస్థితి ఎదుర్కొంటున్నారు.

అన్యాక్రాంతమైనా పట్టదు

జిల్లా వ్యాప్తంగా దాదాపు 12,500 ఎకరాల దేవాదాయశాఖ భూములు అన్యాక్రాంతమైనట్లు.. రెండేళ్ల క్రితం ఆ శాఖ అధికారులు చేపట్టిన సర్వేలోనే వెల్లడైంది. కొందరు వ్యక్తులు ఏళ్లుగా వాటిని అనుభవిస్తున్నారు. ఎకరానికి కనీస కౌలు రూ.10 వేలు చొప్పున లెక్కించినా ఏడాదికి రూ.12 కోట్ల మేర ఆదాయాన్ని ఆ శాఖ కోల్పోతోంది. ఒంగోలు, ఇడుపులపాడు, పర్చూరు, సింగరాయకొండ, అద్దంకి తదితర ప్రాంతాల్లో నిర్మాణాలు సైతం వెలిశాయి. ఇలా ఆక్రమణకు గురైన వాటిని స్వాధీనం చేసుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదు. మరోవైపు రైతులకు చెందిన భూములు, స్థలాలను దేవాదాయశాఖవిగా నమోదు చేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారు.

మారిన విధానంతో చిక్కులు

గతంలో సమస్య తలెత్తినపుడు.. జిల్లా అధికారులు కమిషనర్‌ కార్యాలయానికి వివరాలు పంపితే పరిశీలించి తగు ఉత్తర్వులు జారీ చేసేవారు. గత కొద్ది కాలంగా ఈ విధానంలో మార్పులు చేశారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తును సంబంధిత ఈవో, ఇన్‌స్పెక్టర్‌ పరిశీలించి నివేదిక ఇవ్వాలి. దాని ఆధారంగా సహాయ కమిషనర్‌ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించి డిజిటల్‌ ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాలి. అనôతరం కమిషనర్‌ కార్యాలయానికి వివరాలు నివేదించాలి. తదుపరి అక్కడ ఆమోద ముద్ర వేయాల్సి ఉంటుంది. చెప్పేందుకు సులువుగా ఉన్నా.. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు ఎంత కాలం పడుతుందో ఎవరూ చెప్పలేని పరిస్థితి.

"ప్రభుత్వం త్వరలో చేపట్టనున్న భూ సర్వేలో వివరాలన్నీ బయటకు వస్తాయి. దేవాదాయశాఖకు చెందిన స్థలాలను స్వాధీనం చేసుకుంటాం. ప్రైవేటు వ్యక్తుల భూములు పొరపాటున దేవాదాయశాఖకు చెందినవిగా నమోదైతే.. పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక పంపుతాం. మా వద్దకు వచ్చిన దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తున్నాం." - జి.మాధవి, సహాయ కమిషనర్, ఒంగోలు.

ఉప్పుటూరు సర్వే నం.194/1లో రైతుల భూములున్నాయి. పర్చూరు గ్రామంలో ఇదే సర్వే నెంబరులో నాగులపాలెం రామాలయం భూమి ఉంది. దేవాదాయశాఖ రిజిస్టర్‌లో ఉప్పుటూరు సర్వే నంబరులోని భూములు తమ శాఖవిగా పేర్కొన్నారు. దీంతో రైతుల భూములకు రిజిస్ట్రేషన్‌ జరగడంలేదు. క్రయ, విక్రయాలకు వీల్లేక, బ్యాంకు రుణాలు అందక వారంతా ఇబ్బంది పడుతున్నారు. సమస్య పరిష్కారానికి మూడేళ్ల క్రితం దేవాదాయశాఖకు అర్జీ ఇచ్చారు. అప్పటి సహాయ కమిషనర్‌ ఆదేశాల మేరకు పర్చూరు గ్రూపు-2 ఈవో విచారించి... సవరణ చేసేందుకు తగు ఉత్తర్వులు ఇవ్వాలని నివేదిక సమర్పించారు. నాలుగేళ్లవుతున్నా నేటికీ ఏమీ తేల్చలేదు.

పర్చూరు మండలం అడుసుమల్లిలో సర్వే నం. 74/3లో 1.50 ఎకరాల గ్రామ కంఠం ఉంది. చాలా నివాసాలు ఇందులోనే ఉన్నాయి. 0.31 ఎకరాల విస్తీర్ణంలో ఆలయాలు ఉన్నాయి. కాగా... సర్వే నంబరు మొత్తం దేవాదాయశాఖదిగా నమోదు చేసి రిజిస్ట్రార్‌ కార్యాలయానికి నివేదిక పంపారు. దీంతో ప్రైవేటు వ్యక్తుల భూములు రిజిస్ట్రేషన్లు కావడం లేదు. పొరపాటు సరి చేయాలని ఏడాది క్రితం ఒంగోలు సహాయ కమిషనర్‌ కార్యాలయంలో అర్జీ సమర్పించారు. రెవెన్యూ అధికారులు 2020 జులైలో సబ్‌ డివిజన్‌ చేసి నివేదిక పంపినా... ఇంత వరకు సమస్య పరిష్కారానికి నోచలేదు.... ఇవి రెండు ఉదంతాలు మాత్రమే. జిల్లా వ్యాప్తంగా పరిశీలిస్తే ఇలాంటి సమస్యలు చాలానే ఉన్నాయి.

*జిల్లాలో దేవాదాయశాఖ భూములు: 47,728 ఎకరాలు

* ఆక్రమణలో ఉన్నట్లు గుర్తించినవి: 12,550 ఎకరాలు

ఇదీ చదవండి: ఒకే కుటుంబంలో ఆరుగురు ఎంబీబీఎస్‌లు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.