ప్రస్తుత రాజకీయాల్లో లేకపోవడం నా అదృష్టం - దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు - DAGGUBATI SENSATIONAL COMMENTS - DAGGUBATI SENSATIONAL COMMENTS
🎬 Watch Now: Feature Video


By ETV Bharat Andhra Pradesh Team
Published : Oct 4, 2024, 8:08 PM IST
Former Minister Daggubati Venkateswara Rao Interesting Comments on Politics : బాపట్ల జిల్లా కారంచేడులో మాజీమంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం రాజకీయాల్లో లేకపోవటం వల్ల తాను అదృష్టవంతుడినని వెంకటేశ్వర రావు అన్నారు. కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి ఎమ్మెల్యే అయినప్పటికీ చిన్నచిన్న విషయాలకే ప్రజల నుంచి విమర్శలు ఎదుర్కోవలసి వస్తుందని వ్యాఖ్యానించారు. వరదల సహాయార్థం నిధులు వసూలు చేసిన ఎమ్మెల్యే కొండయ్యను డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఆరోపణలు చేయడం శోచనీయమన్నారు. ఇలాంటి రాజకీయాల్లో తాను లేకపోవడం తన అదృష్టమన్నారు. ఇదే నా చివరి ఉపన్యాసం ఇకపై సభా వేదికలు ఎక్కనని వెంకటేశ్వరరావు స్పష్టం చేశారు.
రాజకీయాల నుంచి సంతోషంగా రిటైర్ అయ్యాననే భావన ఇప్పుడు తనకు కలుగుతోందని వెంకటేశ్వరరావు అన్నారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగాలు సులభంగా వచ్చేవని తెలిపారు. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని వెల్లడించారు. పోటీ పెరిగిపోవడంతో ఉద్యోగం సాధించాలంటే చాలా కష్టమైన పరిస్థితి ఏర్పడిందన్నారు. 1985 నాటి కాలంలో ఉద్యోగాలు ఈజీగా వచ్చేవని అన్నారు. కాగా, దగ్గుబాటి వెంకటేశ్వర రావు సతీమణి పురందేశ్వరి ప్రస్తుతం రాజకీయాల్లో యాక్టివ్‌గా ఉన్నారు. రాజమండ్రి ఎంపీగా, ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె కొనసాగుతున్నారు.