ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రైవేటీకరణ చేయాలంటూ సర్కారు తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్రంలో పలు చోట్ల కార్మికులు ధర్నాలకు దిగారు. విజయనగరంజిల్లాలో సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు పెద్దఎత్తున ధర్నా చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో సీఐటీయూ ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికులు చలో కలెక్టరేట్ చేపట్టారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మధ్యాహ్న భోజన పధకాన్ని ప్రభుత్వమే నిర్వహించాలని డిమాండ్ చేస్తూ కార్మికులు కలెక్టరేట్ ముట్టడించేందుకు వెళ్లారు.
ఇదీ చూడండి మోదీ విధానాలు నచ్చే.. భాజపాలో చేరికలు: కన్నా