ప్రకాశం జిల్లా ఉలవపాడులో.. 35 సంవత్సరాలుగా ఉన్న కృష్ణుని దేవాలయంలో విగ్రహాన్ని కొందరు నేతలు పగులకొట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. కొత్త విగ్రహం ఏర్పాటు చేసుకుంటున్న సమయంలో పోలీసులతో అక్కడికి వచ్చిన ఈవో.... దేవాలయాన్ని కూల్చివేశారని జిల్లా ఎస్పీ సిద్దార్ట్ కౌశల్‌కు ఫిర్యాదు చేశారు. అడ్డుకోవడానికి ప్రయత్నించిన తమ భర్తలపై కేసులు పెట్టారన్నారు. కేసులు పెట్టినప్పటి నుంచి తమ భర్తలు కనిపించకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజు ఇళ్లకు పోలీసులు వచ్చి మహిళలను ఇబ్బంది పెడుతున్నారని ఎస్పీకు వివరించారు.
ఇవి కూడా చదవండి: