ప్రకాశం జిల్లా చీరాలలో జరిగిన ఒక శుభకార్యంలో... “ ఫైర్" కిళ్లీ విశేషంగా ఆకట్టుకుంది. భోజనానంతరం ఆహుతులకు అందించేందుకు, నిర్వాహకులు ప్రత్యేకంగా ఓ కిళ్లీ స్టాల్‌ను ఏర్పాటు చేశారు. అందులో ప్రత్యేకంగా అందించిన " పైర్" కిళ్లీని అందరూ ఇష్టంగా తిన్నారు. వివిధ రకాల దినుసులు వేసిన తరువాత... కిళ్లీకి మంటపెట్టి... అదలా మండుతుండగానే ఆహుతుల నోటిలో వేసేస్తున్నారు. వివాహానికి వచ్చిన వారు లొట్టలేసుకుంటూ పాన్‌ను ఆరగించారు
ఇదీ చదవండి:వెల్డన్.. బాగా పనిచేశారు!