ప్రకాశం జిల్లా కనిగిరిలోని పవిత్ర కల్యాణ మండపంలో కరోనాపై పోలీసుల కుటుంబాలకు డీఎస్పీ కండె శ్రీనివాసరావు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కనిగిరి, వెలిగండ్ల, హనుమంతునిపాడు, పీసీపల్లి మండలాలకు చెందిన పోలీసు కుటుంబీకులు పాల్గొన్నారు.
పోలీసు శాఖ నిరంతరం కరోనాపై అలుపెరగని పోరాటం చేస్తోందని... అందువల్ల వైరస్ తమకూ సోకే ప్రమాదం ఉందని డీఎస్పీ అన్నారు. ప్రతి ఒక్కరూ కరోనా నియమ నిబందనలను కచ్చితంగా పాటించాలని సూచించారు. ప్రజలందరూ తమ ఇళ్లను పరిశుభ్రంగా ఉంచుకోవాలని... విధిగా మాస్కులు ధరించాలని అన్నారు.
ఇదీ చూడండి: