ETV Bharat / state

అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు...రూ.18 లక్షల చోరీ సొత్తు స్వాధీనం - ప్రకాశం జిల్లాలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు

అంతర్రాష్ట్ర దొంగల ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. గుంటూరు జిల్లా నుంచి ఈ ముఠా ప్రకాశం జిల్లాకు వస్తున్నారని సమాచారం అందుకున్న పోలీసులు...మార్కాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో నిఘా పెట్టారు. షిప్ట్ కారులో వస్తున్న వీరిని కంబం వద్ద సమీపంలో పట్టుకున్నారు. సుమారు రూ.18 లక్షల విలువ గల చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Interstate robbery gang
Interstate robbery gang
author img

By

Published : Nov 11, 2020, 9:00 PM IST

వివిధ రాష్ట్రాల్లో దొంగతనాలకు పాల్పడుతున్న ముఠాను ప్రకాశం జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రకాశం జిల్లాకు చెందిన చింతల సిసింద్రి, మన్నెం రామాంజనేయులు, మోటా నవీన్‌, షేక్‌ సాహుల్‌ ఓ ముఠాగా ఏర్పడి ఆంధ్ర, తెలంగాణలలో పలు జిల్లాల్లో దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఈ ముఠా గుంటూరు జిల్లా నుంచి వస్తున్నారని సమాచారం అందుకున్న మార్కాపురం డీఎస్పీ ఆధ్వర్యంలో బృందాలుగా ఏర్పడి నిఘా పెట్టారు. షిప్ట్ కారులో వస్తున్న వీరిని కంబం సమీపంలో పట్టుకున్నారు.

వీరి వద్ద నుంచి కారుతో పాటు, 9 మోటారు సైకిళ్ళు, బంగారం, సెల్‌ ఫోన్లు, టీవీలు వంటి 18 లక్షల రూపాయల విలువ గల చోరీ సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠాపై రెండు రాష్ట్రాల్లో దాదాపు 150 కేసులు ఉన్నట్లు ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ పేర్కొన్నారు.

ఇదీ చదవండి

వైకాపా నిరంకుశత్వంతో ప్రజలను బాధిస్తోంది: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.