ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం చేనేతపురి గ్రామంలో విషాదం జరిగింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్న వంగర మురళి అనే యువకుడు.. పబ్జీ ఆడిన అనంతరం గుండెపోటు వచ్చి మరణించాడు. పబ్జీ ఆడిన అనంతరం, మానసిక ఒత్తిడి తట్టుకోలేక గుండెపోటుతో మరణించాడని...మృతుడు తల్లి కన్నీరుమున్నీరవుతుంది.
సమాచారం అందుకున్న ఎమ్మెల్సీ పోతుల సునీత.. సంఘటనా స్థలానికి చేరుకొని, మురళి మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మానసిక ఒత్తిడికి గురిచేస్తున్న పబ్జీ గేమ్‌ను బ్యాన్ చేయాలన్నారు. మృతుని కుటుంబానికి ప్రభుత్వం సహాయ సహకారాలు అందించేందుకు.. మంత్రి బాలినేని, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. మృతుడు తల్లిని అన్నివిధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పబ్జీ వంటి ఆన్లైన్ గేమ్స్‌ను తక్షణమే నిషేధించాలని ప్రభుత్వాన్ని కోరారు. మురళి కుటుంబానికి తక్షణ సాయంగా 5 వేల రూపాయలను అందజేశారు.
ఇదీ చదవండి: బతికుండగానే శ్మశానానికి!