ETV Bharat / state

ఒంగోలు కుర్రోడు.. ఊళ్లోనే కంపెనీ పెట్టేశాడు! - ఒంగోలు యువకుడు డిజి వ్యూ కంపెనీ పెట్టేశాడు

తనకిష్టమైన రంగాన్ని ఎంచుకున్న ఓ యువకుడు... ఉన్న ఊళ్లోనే ఓ సంస్థను ప్రారంభించాడు. తాను ఎదుగుతూ పది మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. వెబ్​ డిజైనింగ్, డిజిటల్​ మార్కెటింగ్​లో రాణిస్తూ.. పట్టుదల ఉంటే అపజయాల్నే అవకాశాలుగా మార్చుకోవచ్చని నిరూపిస్తున్నాడు. అతడే.. ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సాయి చరణ్ రెడ్డి.

ఒంగోలు కుర్రోడు.. ఊళ్లోనే కంపెనీ పెట్టేశాడు!

author img

By

Published : Jun 11, 2020, 1:16 AM IST

ప్రకాశం జిల్లా ఒంగోలుకు చెందిన సాయిచరణ్‌ రెడ్డి ఇంజినీరింగ్‌లో ఈసీఈ చేశారు. పట్టా రాగానే విదేశాల్లో కొలువు కోసం ప్రణాళికలు వేసుకున్నారు. ఈ సమయంలో ఉమ్మడి రాష్ట్ర విభజనపై ఉద్యమం జరుగుతుంది. సకలం బంద్‌.. ఇంట్లో ఖాళీ ఉన్న ఆ సమయంలో సాయి చరణ్ డిజిటల్​ టెక్నాలజీపై ఆసక్తి పెంచుకున్నారు. సాఫ్ట్‌వేర్‌ స్కిల్స్‌తో పాటు వెబ్‌ డిజైనింగ్‌, సర్వీస్‌ మీద అవగాహన పెంచుకున్నారు. వెబ్ డిజైనింగ్​ను కెరీర్​గా మలుచుకున్నారు.

అప్పటి నుంచి వెబ్‌ డిజైన్‌, యాప్స్‌ రూపకల్పన, ఆన్​లైన్‌ మార్కెటింగ్‌ వంటి విషయాలపై అవగాహన పెంచుకున్నారు. సొంతంగా డిజిటల్‌ మార్కెటింగ్‌ ప్రారంభించారు. నగరాల్లో డిజిటల్‌ టెక్నాలజీ ట్రైనింగ్‌, సర్వీస్‌, మార్కెటింగ్‌ విభాగాల్లో మంచి డిమాండ్‌ ఉంటుంది. తాను పుట్టి పెరిగిన ఒంగోలులో వీటికి అంతగా అవకాశాలు లేవని తెలిసినా... పట్టుదలతో వ్యాపారాన్ని ప్రారంభించారు. ఇతర ప్రాంతాల్లోని వివిధ సంస్థలతో ఒప్పందాలు చేసుకుని సర్వీసెస్‌ విభాగంలో వ్యాపారాన్ని కొనసాగించారు.

తొలుత ఇద్దరు ఉద్యోగులతో...తన ఇంటి వద్దనే డిజి వ్యూ పేరుతో కంపెనీ ప్రారంభించారు సాయిచరణ్. ఇందులో డిజిటల్‌ మార్కెటింగ్‌, డిజిటల్‌ టెక్నాలజీ ఎనెబుల్‌ సర్వీసెస్, సామాజిక మాధ్యమాల్లో అడ్వర్​టైజింగ్‌, ఆన్‌ లైన్‌ విద్య, ఆండ్రాయిడ్‌- ఐఓఎస్ యాప్స్‌ రూపకల్పన వంటి సేవలందిస్తూ కంపెనీ ఆదాయాన్ని పెంచుకున్నారు.

ఇద్దరితో ప్రారంభమైన డిజి వ్యూ ఇప్పుడు దాదాపు 15 మందికి ఉపాధి కల్పిస్తోంది. వీరంతా కలిసి.. రిక్రూట్ మెంట్ ఇండియా పేరుతో ఓ వెబ్‌సైట్‌ను నిర్వహిస్తున్నారు. దీంట్లో వివిధ పోటీ పరీక్షలకు సంబంధించిన ఫ్రీ, పెయిడ్‌ మెటీరియల్‌, మాక్‌ టెస్టులు అందుబాటులో ఉంచుతున్నారు. దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల్లో ఉధ్యోగ నియామకాలకు సంబంధించిన వివరాలను ఇందులో పొందుపరుస్తున్నారు. తన వెబ్‌సైట్‌ 1090 ర్యాంకింగ్​లో ఉందని సాయి చరణ్‌ పేర్కొన్నారు. ఈ సంస్థ ద్వారా స్థానిక యువతకు ఉపాధి లభిస్తోందని చెప్పారు. ఇంజినీరింగ్‌, డిగ్రీ, ఎంబీఏ చేసిన యువతకు ఈ సంస్థలో ఉద్యోగాలు కల్పిస్తున్నానని సాయి చరణ్ తెలిపారు.

సంస్థ ప్రారంభించిన తొలినాళ్లలో అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నానని, వైబ్​సైట్​కు వీక్షకులను రప్పించడంలో ఎంతో కష్టపడాల్సి వచ్చిందన్నారు. అపజయాలను అనుభవాలుగా తీసుకొని పట్టుదలతో ముందుకు సాగితే విజయం సాధిస్తామని సాయి చరణ్ అన్నారు.

ఇదీ చదవండి:

'అధికార పార్టీ నేతల భూదందా'... సీఎంకు వైకాపా నాయకుడి లేఖ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.