ETV Bharat / state

అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిన అద్దంకి - prakasam dst crime news

ప్రకాశం జిల్లా అద్దంకి అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారుతోంది. గంజాయి, గుట్కా, నకిలీ మందులు ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నెన్నో. జిల్లాలో ఎక్కడ ఏ నేరం జరిగినా దానికి మూలం ఇక్కడే ఉంటోంది. నేరగాళ్లకు నిలయంగా... అక్రమాలకు అడ్డాగా మారడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

illegal business heavy in adanki prakadam dst
అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిన అద్దంకి
author img

By

Published : Jan 12, 2020, 9:41 PM IST

అక్రమ వ్యాపారాలకు అడ్డాగా మారిన అద్దంకి
గంజాయి అక్రమ రవాణాకు ప్రకాశం జిల్లా అద్దంకి కేరాఫ్​గా నిలిచింది. రాంనగర్​లో సంవత్సరం నుంచి వ్యాపారం జోరుగా సాగుతోంది. అప్పట్లో ఈటీవీ భారత్ కథనంతో పోలీసులు గంజాయి ముఠాను అరెస్ట్ చేశారు. సుమారు 120 కిలోలకు పైగా సరుకును స్వాధీనం చేసుకున్నారు. కొంతమేర వ్యాపారం తగ్గినప్పటికీ... మళ్లీ చిన్న చిన్న దుకాణాల్లో చాప కింద నీరులా ఇది పుంజుకుంటోంది.

గుట్కా తయారికీ మేదరమెట్ల

గుట్కా వ్యాపారానికీ అద్దంకిలో అక్రమార్కులు తెర లేపారు. మేదరమెట్ల కేంద్రంగా తయారుచేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇక్కడి నుంచే పలు రాష్ట్రాలు, జిల్లాలకు సరఫరా జరుగుతున్నట్లు నిర్ధరణకు వచ్చారు.

నకిలీ మద్యానికీ చిరునామా

అద్దంకి పట్టణంలో నకిలీ మద్యం సైతం తయారు చేస్తున్నారు. నకిలీ పురుగు మందుల తయారీకి సంబంధించిన రసాయనాల ఖాళీ డబ్బాల మూతలు, కంపెనీలకు సంబంధించిన లేబుల్స్ వంటివి ఎన్నో ఈ కేంద్రాల్లో అధికారులకు దొరికాయి. నకిలీ మద్యంతో ప్రజలను... నకిలీ పురుగు మందులతో రైతులను అక్రమ వ్యాపారులు పూర్తిగా మోసం చేస్తున్నారు.

కుంభకోణమేదైనా... మూలం ఇక్కడే

ప్రకాశం జిల్లాలో ఏ కుంభకోణం జరిగినా మూలం ఇక్కడే ఉండడం గమనార్హం. ఇవే కాకుండా రహదారి పక్కన మరెన్నో చీకటి వ్యాపారాలు జరుగుతున్నాయి. పోలీస్, ఇంటెలిజెన్స్ అధికారుల కళ్ళు గప్పి అక్రమార్కులు దర్జాగా దందా సాగిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాలని స్థానికులు కోరుతున్నారు.

ఇదీ చూడండి:

పృథ్వీరాజ్‌పై ఎస్వీబీసీ ఉద్యోగుల ఆగ్రహం..తొలగించాలని డిమాండ్​

Intro:ap_ong_61_11_illigal_bussines_adda_addanki_avb_pkg_ap10067

కంట్రిబ్యూటర్ నటరాజు

సెంటర్ అద్దంకి

-----------------------------------------------
టైటిల్ : అక్రమ వ్యాపారాలకు..... అడ్డాగా మారిన అద్దంకి.....

యాంకర్ : ప్రకాశం జిల్లా అద్దంకి ఘన చరిత్ర ఉంది. రెడ్డి రాజులు పరిపాలించిన ప్రాంతం ఇది.తొలి తెలుగు పద్య శాసనం వెలుగు చూసింది ఇక్కడే. ఒకవైపు ఆహ్లాదపరిచే గుండ్లకమ్మ, మరోవైపు అద్దంకి నార్కెట్పల్లి రహదారి ప్రారంభం ఇక్కడి నుంచె, ఇన్ని రకాల సదుపాయాలతో అద్దంకి అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుంది. ఇది అంతా కూడా నాణ్యం కు ఒక వైపు మాత్రమే...... రెండో వైపు ఏం జరుగుతుందో తెలుసుకోవాలంటే ఈ కథనం చూడాల్సిందే......

AV 1 ()

ప్రకాశం జిల్లా అద్దంకి నియోజకవర్గంలొ 5 మండలాలు ఉన్నాయి. ఇవి అద్దంకి నార్కెట్పల్లి కి రహదారికి ఆనుకొని కొన్ని ఉంటే.... మరికొన్ని హైదరాబాద్ చెన్నై జాతీయ రహదారి కి పక్కనే ఉంటాయి . ఏ వ్యాపారం చేయాలన్న రహదారి సౌకర్యం ప్రధానం అందుకు అనువుగా ఉన్నటువంటి అద్దంకి నియోజకవర్గంలో అక్రమ వ్యాపారాలకు పెద్ద పేట గా మారింది.

అద్దంకి పట్టణంలోని రాంనగర్ అడ్డాగా గత సంవత్సరం గంజాయి వ్యాపారం జోరుగా సాగేది . పరిసర ప్రాంత జిల్లాలకు సరఫరా చేసే స్థాయికి అక్రమార్కులు ఎదిగిపోయారు. అప్పట్లో ఈటీవీ కథనంతో స్థానిక పోలీసులు గంజాయి ముఠా ను అరెస్ట్ చేయడం జరిగింది.
సుమారుగా 120 కిలోలకు పైగా స్వాధీనం చేసుకున్నారు.
అప్పట్లో కొంతమేర గంజాయి సరఫరా ఆగి పోయినప్పటికీ, ప్రస్తుతం అక్కడక్కడ చిన్నపాటి దుకాణాల్లో దొరుకుతునె ఉంది. ఈ సంఘటన మరిచిపోయే లోపే మరో కొత్త వ్యాపారం మొదలైంది.

కొరిసపాడు మండలం మేదరమెట్లలో పెద్ద ఎత్తున సరుకున్న గుట్కా లారీ ని స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో అధికారులకు అనుమానం రాకుండా అక్రమార్కులు జాగ్రత్తపడ్డారు. కానీ 6 నెలల క్రితం గుట్కా తయారీ కేంద్రాన్ని మేదరమెట్ల లో ఉన్న సంగతి వెలుగులోకి వచ్చింది. ఇక్కడి నుంచే పలు రాష్ట్రాలకు జిల్లాలకు సరఫరా జరుగుతున్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. వీటన్నిటికీ మించి ఎన్నికలే లక్ష్యంగా సరికొత్త వ్యాపారం వెలుగులోకి వచ్చింది.

అద్దంకి పట్టణం లోని శ్రీనగర్లో నకిలీ మద్యం తయారీ కేంద్రం పై పోలీసులు దాడి చేశారు. ఇది గత సంవత్సరం ఎన్నికల సమయం నుంచే నిర్వహిస్తున్నట్లు అధికారులు అంచనాకు వచ్చారు. గతంలో అద్దంకి నియోజకవర్గం లోని సంతమాగులూరు అడ్డాగా ఈ నకిలీ మద్యం తయారీ జరిగేది అప్పట్లో పోలీసుల దాడి తో ఆగిపోయింది అనుకుంటున్నా నకిలీ మద్యం ఇటీవల అద్దంకి పట్టణంలో తయారు జరుగుతూ వివిధ ప్రాంతాలకు సరఫరా అవుతుందని పోలీసుల దాడితొ వెలుగులోకి వచ్చింది.

BITE 1 : ఎక్సైజ్ సిఐ తిరుపతయ్య.

నకిలీ మద్యం తయారీ కేంద్రంలోనే నకిలీ పురుగుమందుల తయారీకి సంబంధించిన రసాయనాలు ఖాళీ డబ్బాలు మూతలు కంపెనీలకు సంబంధించిన లేబుల్స్ వంటివి ఎన్నో దొరికాయి. నకిలీ మద్యం తో ప్రజలను నకిలీ పురుగుమందులతో రైతులను అక్రమ వ్యాపారులు పూర్తిగా మోసం చేస్తున్నారు.

BITE 2 : మండల వ్యవసాయ అధికారి వెంకటకృష్ణ

ప్రకాశం జిల్లాలో ప్రధానంగా ఒక పెద్ద కుంభకోణం ఏదైనా జరిగింది అంటే దానికి మూలం అద్దంకి నుంచే ప్రారంభం అవుతుంది. అది హత్యలు కానీ, దోపిడీలు కానీ, మరేదైనా మోసపూరిత వ్యాపారమైనా నాంది మాత్రం అద్దంకి కె దక్కుతుంది. ఇవే కాకుండా రహదారి పక్కన మరెన్నో చీకటి వ్యాపారాలు జరుగుతున్నాయి. డీజిల్ మరియు పామ్ ఆయిల్ వంటివి లారీ నుంచి కార్చడం మొదలగునవి నిత్యం జరుగుతూనే ఉన్నాయి.

BITE 3 : ఎక్సైజ్ అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాస్ చౌదరి.

పోలీస్ నిఘా అధికారులు, మరియు ఇంటిలిజెన్స్ అధికారులు, కళ్ళు గప్పి అక్రమార్కులు వ్యాపారాలు సాగిస్తున్నారు. పోలీసులు మరియు ఎక్సైజ్ అధికారులకు తెలియకుండానే వ్యాపారాలు సాగిస్తున్నారు. ఒకచోట అరికడితే మరోచోట ప్రారంభిస్తున్నారు.

END VOICE

ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి అభివృద్ధి పథంలో నడవాల్సిన అద్దంకిని అక్రమ వ్యాపారాలకు నిలయంగా మార్చుతున్న అక్రమార్కులను గుర్తించేందుకు ప్రత్యేక ప్రణాళికలు ఏర్పాటు చేసి అక్రమ వ్యాపారాలు రూపుమాపాలి అని స్థానికులు పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Body:.

Conclusion:.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.