ప్రకాశం జిల్లా దర్శిలో ఒక వ్యక్తికి కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో పట్టణాన్ని జిల్లా అధికారులు కంటైన్మెంట్ జోన్‌గా ప్రకటించారు. పట్టణంలోని దుకాణాల్లో నిబంధనలు కఠినంగా అమలు చేయకపోతే సీజ్ చేస్తామని డీఎస్పీ ప్రకాశరావు హెచ్చరించారు. ప్రజలు మాస్కులు లేకుండా రోడ్ల మీదకు వస్తే 100 రూపాయల జరిమానా విధిస్తామని అధికారులు హెచ్చరించారు.
ప్రజలు, దుకాణదారులు మరింత అప్రమత్తంగా ఉండి కరోనా మహమ్మారి నుంచి ప్రాణాలను కాపాడుకోవాలని సూచించారు.
ఇదీ చదవండి: 2 వేల అప్పు తీర్చమంటే.. బావకే బాణమేసి చంపేశాడు!