భార్యను హత్య చేసిన కేసులో భర్తను ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈపురుపాలెం పంచాయతీ బండారు నాగేశ్వరరావు కాలనీకి చెందిన నీలం కృష్ణమూర్తి.. గత ఆగస్టు నెల 25 తారీఖున తన భార్య ఆదిలక్ష్మిపై కర్రతో దాడిచేసి పారిపోయాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతూ అదే నెల 30వ తేదీన ఆమె మృతి చెందింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అప్పటినుంచి నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఈరోజు గుంటూరు జిల్లా స్టువర్ట్పురం రైల్వేస్టేషన్లో ఉన్నాడనే సమాచారంతో అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నామని డీఎస్పీ జయరామ సుబ్బారెడ్డి తెలిపారు.
ఇవీ చదవండి