పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)ను తప్పుదోవ పట్టిస్తూ అనేక రాజకీయ పార్టీలు, విధ్వంసక శక్తులు దేశంలో అరాచకాన్ని స్పష్టించేందుకు ప్రయత్నిస్తున్నాయని ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా భాజపా ఆధ్వర్యంలో ఒంగోలులో తిరంగా ర్యాలీ జరిగింది. ఎంపీ జీవీఎల్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఏకేవీకే కళాశాల నుంచి ప్రారంభమైన ర్యాలీ... అద్దంకి బస్ స్టాండ్ మీదగా కలెక్టరేట్ వరకు సాగింది.100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు. సీఏఏకు మద్దతుగా నినాదాలు చేశారు. పౌరసత్వ సవరణ బిల్లుపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు అన్ని జిల్లాల్లో అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని జీవీఎల్ తెలిపారు.
'పౌరసత్వ సవరణ చట్టాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు'
కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన పౌరసత్వ సవరణ చట్టానికి మద్దతుగా ఒంగోలులో భారీ ర్యాలీ జరిగింది. 100 మీటర్ల జాతీయ జెండాతో ర్యాలీలో విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భాజపా ఎంపీ జీవీఎల్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.