ETV Bharat / state

భారీగా రేషన్ బియ్యం సీజ్.. 900 బస్తాలు స్వాధీనం

భారీ మొత్తంలో మార్కాపురం ఎన్​ఫోర్స్ మెంట్ అధికారులు రేషన్ బియ్యాన్ని పట్టుకున్నారు. పేదల కోసం పంపిణీ చేసే బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్న టర్బో లారీనీ, మినీ లారీలను స్వాధీనం చేసుకున్నారు. మొత్తంగా సుమారు 900 బస్తాలను సీజ్ చేశారు.

భారీగా రేషన్ బియ్యం సీజ్.. 900 బస్తాలు స్వాధీనం
భారీగా రేషన్ బియ్యం సీజ్.. 900 బస్తాలు స్వాధీనం
author img

By

Published : May 7, 2021, 12:01 PM IST

ప్రకాశం జిల్లా, ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామ సమీపంలో ఆంజనేయ బాయిల్డ్ రైస్ మిల్లుపై మార్కాపురం ఎన్​ఫోర్స్ మెంట్​ అధికారులు దాడులు నిర్వహించారు. మిల్లు వద్ద నుంచి కృష్ణ పట్టణం పోర్టుకు తరలించేందుకు రేషన్ బియ్యంతో సిద్ధంగా ఉన్న ఓ టర్భో లారీని, మిల్లు వద్దకు రేషన్ బియ్యాన్ని తీసుకువచ్చిన రెండు మినీ లారీలను బుధవారం అర్థరాత్రి 2 గంటల సమయంలో అదుపులోకి తీసుకున్నారు.

సుమారు రూ.14.46 లక్షల విలువ..

అనంతరం మినీ లారీల్లోని 66 బస్తాలు, టర్బో లారీలోని 670 బస్తాలు, మిల్లులో నిల్వ ఉంచిన 150 బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. వీటి విలువ సుమారు రూ. 14.46 లక్షలు ఉంటుందని అంచనా వేశారు. స్వాధీనం చేసుకున్న వాహనాలను ముండ్లమూరు ఠాణాలో అప్పజెప్పినట్లు పేర్కొన్నారు. స్థానిక స్టేషన్ ఎస్సైని చారవాణి ద్వారా ఈటీవీ భారత్ వివరణ కోరగా మొదట లారీలను స్టేషన్​లో అప్పగించారని.. అనంతరం ఎన్​ఫోర్స్​మెంట్ అధికారులే తీసుకెళ్లారని వివరించారు.

కొస మెరుపు..

మిల్లును ఓ ప్రజా ప్రతినిధి సోదరుడు అద్దెకు తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు స్థానికులు అంటున్నారు. అధికారులు వాహనాలను పట్టుకున్న సమయంలో రాజకీయంగా ఒత్తిడి రావటంతో తిరిగి వాహనాలను స్థానిక ఠాణాలో కాకుండా ఇతర ప్రదేశానికి తరలించినట్లు సమాచారం.

ఇవీ చూడండి : కరోనా వేళ మందులకు కటకట.. అందుబాటులో లేని ప్రాథమిక ఔషధాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.