ప్రకాశం జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు... వంకలు పొంగి పొర్లుతున్నాయి. పొదిలి మండలం బట్టువారిపల్లి గ్రామ సమీపంలోని డొల్లేరు వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ఫలితంగా మార్కాపురం-ఒంగోలు రహదారిపై రాకపోకలు స్తంభించాయి. ముండ్లమూరు మండలం మారేళ్ల జమ్మలమడుగు గ్రామాల మధ్య వాగు పొంగి పొర్లుతున్నకారణంగా... వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
ఇదీ చూడండి: ప్రకాశం జిల్లాలో భారీ వర్షం