అధికారుల ప్రణాళిక లోపంతో వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద ప్రజలు గుంపులుగా చేరుతున్నారు. ప్రకాశం జిల్లా మార్టూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 45 ఏళ్లు దాటినవారు ఉదయం నుండే టీకా కోసం బారులు తీరారు. ఉదయం 11 గంటలకు వచ్చిన వైద్య సిబ్బంది.. 300 మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. దీంతో టీకా కేంద్రం వద్ద తోపులాట జరిగింది. ఉదయం నుంచి క్యూలో ఉన్నా టీకా అందకపోవడంతో పలువురు నిరాశగా వెనుదిరిగారు.
ఇదే పరిస్దితి కొనసాగితే టీకా మాట దేవుడెరుగు కరోనా బారిన పడతామని కొందరూ ఆందోళన చెందుతున్నారు. ఇలా టీకా కేంద్రం వద్ద పోటీ పడి కరోనా తెచ్చుకునే కన్నా గ్రామ సచివాలయాల్లో టీకాలు వేస్తే బాగుంటుందని మార్టూరు వాసులు అభిప్రాయపడుతున్నారు.
ఇదీ చదవండి..