ETV Bharat / state

లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ హెడ్​ కానిస్టేబుల్

ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీస్​స్టేషన్​లో లంచం తీసుకుంటున్న హెడ్​ కానిస్టేబుల్​ను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడి ద్వారా అందిన సమాచారం మేరకు దాడులు నిర్వహించినట్లు తెలిపారు.

Head Constable arrested for taking bribe
ఏసీబీకి పట్టుబడ్డ హెడ్​ కానిస్టేబుల్
author img

By

Published : Jun 17, 2021, 7:11 PM IST

ప్రకాశం జిల్లా గిద్దలూరు పోలీస్​స్టేషన్​లో అవినీతికి పాల్పడిన హెడ్​ కానిస్టేబుల్​ను రెడ్​ హ్యండెడ్​గా పట్టుకున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించామని చెప్పారు.

ఏసీబీ అధికారుల వివరాల ప్రకారం:

మండలంలోని రామాపురం గ్రామానికి చెందిన మదిరే రంగ సాయిరెడ్డి పొలం గట్టు విషయంలో ఫిర్యాదు చేసేందుకు పోలీస్​స్టేషన్​కు వచ్చాడు. పోలీసులు అతని ఫిర్యాదును నమోదు చేసుకోలేదు. దీంతో అతను ఉన్నతాధికారులను ఆశ్రయించాడు. వారి ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న హెడ్​ కానిస్టేబుల్...​ ఫిర్యాదు చేసే వ్యక్తి నుంచి రూ.5000 డిమాండ్​ చేశాడు. ఫిర్యాదుదారుడు స్పందన కార్యక్రమం ద్వారా కంప్లైట్​ చేయగా.. దాడులు నిర్వహించి హెడ్​ కానిస్టేబుల్​ను పట్టుకున్నారు. కేసు నమోదు చేసేందుకు డబ్బులు డిమాండ్​ చేయటం చట్ట వ్యతిరేకం.. కావున అతనిపై తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు.

ఇదీ చదవండి: అధికారుల అలసత్వం.. పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.