ప్రకాశం జిల్లాలో గుట్కా వ్యాపార రాకెట్ వెలుగులోకి వచ్చింది. తాళ్లూరు మండలంలోని గంగవరం, దోసకాయలపాడు గ్రామాల్లో గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై నాగరాజు బృందంతో కలసి గ్రామాల్లో దాడులు నిర్వహించారు. గంగవరంలోని సాతులూరు రామకృష్ణ వద్ద నుంచి సుమారు 8 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా బస్తాలు స్వాధీనం చేసుకున్నారు. అతన్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా... దోసకాయలపాడులో రెండు రూములు అద్దెకు తీసుకుని అంజిరెడ్డి, వెంకటేశ్వర్లు కూడా నిల్వ ఉంచారని తేలింది. దీంతో పోలీసులు గ్రామంలోని షట్టర్లను పగులకొట్టి పరిశీలించగా... సుమారు 12 లక్షల రూపాయల విలువ కలిగిన గుట్కాలు లభించాయి. వీటిని తాళ్ళూరు స్టేషన్కు తరలించినట్లు ఎస్ఐ నాగరాజు తెలిపారు. పట్టుబడ్డ సరుకును పరిశీలించి ఫుడ్ కంట్రోల్ సంస్థ వారికి అప్పగించారు.
ఇదీ చదవండి :