ETV Bharat / state

HAL MARK: హాల్ మార్క్ నిబంధనకు నిరసనగా.. 23న స్వర్ణకారుల సమ్మె

బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ తప్పనిసరి.. అని కేంద్రం తెచ్చిన నిబంధన.. ఆచరణ సాధ్యం కాదని స్వర్ణ, వెండి, డైమండ్‌ వర్తకులు తేల్చి చెబుతున్నారు. ఈ నిబంధనను నిరసిస్తూ సోమవారం దేశవ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తున్నారు. కేంద్రం సమస్యలను పరిగణలోకి తీసుకుని నిర్ణయాన్ని వెనక్కితీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

HAL MARK
HAL MARK
author img

By

Published : Aug 21, 2021, 5:58 PM IST

బంగారు ఆభరణాలపై హాల్‌మార్క్‌ వేయాలన్న నిబంధనను కేంద్ర ప్రభుత్వం విధించడాన్ని నిరసిస్తూ.. ఆభరణాల వ్యాపారులు సమ్మె చేయనున్నట్లు తెలిపారు. కేంద్రం నిర్ణయం వల్ల వ్యాపారాలు నిర్వహించలేమని.. ఇప్పుడున్న పరిస్థితిల్లో హాల్‌ మార్క్‌ వేయటం అసాధ్యమని వారు తేల్చి చెబుతున్నారు. కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ నెల 23న దేశ వ్యాప్తంగా సమ్మె పాటిస్తున్నామని స్వర్ణ, వెండి, డైమండ్‌ వర్తకుల సంఘం ప్రతినిధులు తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఉన్న 700 జిల్లాల్లో.. కేవలం 250 జిల్లాల్లో మాత్రమే హాల్‌మార్క్‌ వేసే పరిశ్రమలు ఉన్నాయని.. వ్యాపారుల వద్ద ఇప్పుడున్న ఆభరాణాలన్నిటికీ మార్క్‌ వేయాలంటే ఏడాదైనా చాలదని చెప్పారు. రెండు లక్షలకు పైగా విలువైన ఆభరణాలు కొనేందుకు పాన్‌ కార్డు, ఆధార కార్డు ఇవ్వాలని ప్రభుత్వం అంటోందని.. కానీ దేశంలో 90 శాతం మందికి పాన్‌ కార్డు లేదని వారు అన్నారు. దేశంలోని గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయం మీద ఆదారపడి నివసించేవారు బంగారం కొనుక్కోవాలంటే ఈ నిబంధనలతో సాధ్యం కాదని చెప్పారు.

ఈ సమస్యలను దృష్టిలోకితీసుకుని కేంద్రం తన నిర్ణయాన్ని విరమించుకోవాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయాన్ని నిరసిస్తూ వర్తక సంఘాలు సోమవారం దేశ వ్యాప్తంగా సమ్మె నిర్వహిస్తాయని.. కేంద్రం తన నిర్ణయాన్ని విరమించుకోకపోతే ఆందోళన ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చదవండి:

RAPE CASE: ప్రభుత్వ ఉద్యోగమంటూ తీసుకెళ్లి అత్యాచారం.. ఆపై నగ్నవీడియోలతో బెదిరింపు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.