టేబుల్ ఫ్యాను కోసం ..స్విచ్ బోర్డులో విద్యుత్ ప్లగ్ పెడుతుండగా.... షాక్ తగిలి ఓ బాలిక మృతి చెందింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా పొదిలి పట్టణంలో జరిగింది.
శ్రీనివాసరెడ్డి, వెంకటరమణి దంపతుల కుమార్తె ట్వింకిల్. 10 ఏళ్ల క్రితం బతుకుదెరువు కోసం తెనాలి నుంచి పొదిలి వలస వచ్చారు. ట్వింకిల్.. టేబుల్ ఫ్యాను కోసం స్విచ్ బోర్డులో ప్లగ్ పెడుతుండగా విద్యుదాఘాతంతో మృతి చెందింది. తమ ఏకైక కుమార్తెను విగత జీవిగా పడి ఉండటాన్ని చూసి తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
ఇదీచూడండి. వృద్ధురాలి ఇంట్లో చోరీ.. నిందితుడు అరెస్ట్