ETV Bharat / state

ప్రియుణ్ని నిర్భందించి ప్రియురాలిపై అత్యాచారం - ప్రకాశం జిల్లా, చీరాల

ప్రకాశం జిల్లాలో దారుణం జరిగింది. ప్రియుణ్ని నిర్భందించి ప్రియురాలిపై కొందరు యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలుసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.

కామాంధుల కోసం గాలిస్తున్నపోలిసులు
author img

By

Published : Jul 21, 2019, 4:13 PM IST

చీరాల అత్యాచార కేసులో నిందితుల కోసం పోలీసులు గాలింపు

ప్రకాశం జిల్లాలోని చీరాల సమీపంలోని కారంచేడులో అత్యాచారం జరిగింది. చీరాల పట్టణానికి చెందిన ఓ యువతికి మూడేళ్ల క్రితం వివాహం జరిగింది. కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకొని తల్లిదండ్రుల వద్దే ఉంటూ... ఓ దుకాణంలో పని చేస్తోంది. దుకాణంలో పని చేస్తున్న సమయంలోనే ఓ యువకుడితో పరిచయమేర్పడి ప్రేమగా మారింది. వీరిద్దరూ శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో కారంచేడు సమీపంలోని వంతెన వద్దకు వెళ్లి మాట్లాడుకుంటున్నారు. అదే సమయంలో అటుగా బైకుపై వచ్చిన ముగ్గురు యువకులు వారిని నిర్బంధించి... వారి వద్దనున్న మొబైల్ ఫోన్‌తో పాటు డబ్బులు లాక్కున్నారు. అక్కడితో ఆగకుండా... యువకునిపై దాడిచేసి యువతిని లాక్కెళ్లి అత్యాచారం చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా...కేసును నమోదు చేసుకున్న పోలీసులు సబ్‌డివిజన్ పరిధిలోని ముగ్గురు ఎస్సైల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. ప్రస్తుతం బాధితురాలు చీరాల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు ఆయన తెలిపారు.

ఇది చూడండి: 100 రూపాయల కోసమే హత్య జరిగిందా?

Lucknow (Uttar Pradesh), Jul 21 (ANI): Body of a new born girl was found near King George's Medical University (KGMU) yesterday. ASP Durga Prasad Tewari said, "1-2 day old infant was found dead near KGMU. Her body was sent for postmortem. Investigation is underway, action will be taken."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.