ధైర్యంగా ఉంటే కరోనాను జయించవచ్చని ప్రకాశం జిల్లా చీరాల రెడ్ క్రాస్ చైర్మన్ డాక్టర్ జి. సుబ్బారావు అన్నారు. చీరాలలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో కరోనా వైరస్ నివారణ కోసం మందులను పంపిణీ చేశారు. కరోనా పాజిటివ్ వచ్చి చీరాల పట్టణంలో వివిధ ప్రాంతాల్లో హోమ్ ఐసోలేషన్లో ఉన్న వారికి రూ.1000 విలువైన మందులను పంపిణీ చేశారు.
కరోనా వైరస్ సోకిన బాధితులను ఆదుకోవాలని రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, పలువురు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు.. ఉచితంగా మందులు పంపిణీ చేసినట్లు రెడ్ క్రాస్ చైర్మన్ సుబ్బారావు తెలిపారు.
ఇదీ చదవండి:
రాష్ట్రానికి వంద ఆక్సిజన్ కాన్సంట్రేటర్లు అందజేసిన డబ్ల్యూహెచ్వో