ప్రకాశం జిల్లా దర్శిలో కల్తీ వంట నూనెను అమ్ముతున్న షాపుల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. దర్శి మండలంలో కల్తీ నూనెల ను అధికంగా అమ్ముతున్నారనే సమాచారంతో ఈ దాడులు చేపట్టినట్లు ఫుడ్ సేఫ్టీ అధికారి నాగూర్ మీరా తెలిపారు. ఈ క్రమంలో రెండు షాపుల్లో విక్రయిస్తున్న లూజ్ ఆయిల్ ను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ లక్ష ఇరవై వేలకు పైనే ఉంటుందని తెలిపారు. ఎఫ్ఎస్ఎస్ 2006 చట్టప్రకారం లూజ్ ఆయిల్ ను అమ్మడం నేరమని అన్నారు. ఈ రెండు షాపుల నుంచి కలెక్ట్ చేసిన ఆయిల్ శాంపిల్స్ లను ల్యాబ్ కు పంపిస్తున్నామని వచ్చే రిజల్ట్స్ ను ఆధారంగా చేసుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. హోల్ సేల్ షాప్ లతో పాటు చిల్లర దుకాణాలు కూడా కల్తీ నూనెలు అమ్ముతున్నారని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండీ.. శాండ్ ఆర్ట్ తో.. ఫాదర్స్ డే శుభాకాంక్షలు!