ETV Bharat / state

సముద్రంలో మత్స్యకారుల మధ్య వివాదం.. బోట్లతో ఛేజింగ్..! - vada revu fisher men issue latest news

సముద్రంలో సుమారు 15 బోట్లు.. ఒకదాని మీదకి ఒకటి రయ్యిమంటూ దూసుకుపోతున్నాయ్. సముద్రం అల్లకల్లోలమైంది. బోట్లపైనే ఇరువర్గాలు గొడవపడుతూ.. సముద్రాన్ని రణరంగంలా మార్చారు. ఇదేదో సినిమా ఛేజింగ్​ ఫైట్ అనుకునేరు..! రెండు వర్గాల మత్స్యకారుల మధ్య సముద్రంలో జరిగిన గొడవ సినిమా ఛేజింగ్​ను తలపించింది. ఈ ఘటన ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలోని తీరప్రాంతంలో జరిగింది.

fisher men chasing in sea at chirala
సముద్రంలో ఛేజింగ్
author img

By

Published : Dec 3, 2020, 5:01 PM IST

Updated : Dec 3, 2020, 5:49 PM IST

సముద్రంలో వేట సాగించే విషయంలో రెండు వర్గాల మత్స్యకారుల మధ్య జరిగిన గొడవ సినిమా ఛేజింగ్​ను తలపించింది. ప్రకాశం జిల్లా చీరాల పరిధిలోని సముద్రంలో మత్స్యకారుల గొడవ ఆలస్యంగా వెలుగు చూసింది. చేపలు పట్టుకునే విషయంలో వాడరేవు మత్స్యకారులు- కఠారిపాలెం, పోట్టిసుబ్బయ్య పాలెం, రామచంద్రాపురం జాలరుల మధ్య వివాదం తలెత్తింది. వాడరేవు జాలర్లు తమ పరిధిలోకి వచ్చి చేపలు పడుతున్నారని.. మిగతా మూడు గ్రామాల మత్స్యకారులు గొడవకు దిగారు. నడుస్తున్న పడవలపైనే ఇరువర్గాలు పరస్పరం గొడవపడ్డాయి. ఆ తర్వాత ఒంగోలు వెళ్లి జిల్లా మత్స్యశాఖ అధికారులకు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. వివాదాలకు పోవద్దని వారికి హితవుపలికిన అధికారులు.. సమస్యను సామరస్యపూర్వకంగా పరిష్కరిస్తామని నచ్చజెప్పి పంపారు.

అసలు సమస్య ఏంటి..?

బల్ల వలల ద్వారా ఒక వర్గం, ఐలా వలల ద్వారా మరో వర్గం చేపల వేట సాగిస్తున్నారు. ఐలా విధానంతో చేపలు గుడ్లు పెట్టే ప్రాంతంలో వేట సాగిస్తున్నారని, దీని వల్ల సంతానోత్పత్తికి విఘాతం ఏర్పడుతుందని ఒక వర్గం వాదిస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు మేరకే వేట సాగిస్తున్నామని రెండు వర్గం అంటోంది. సముద్రంలో వేటకు వెళ్తే మధ్యలో దౌర్జన్యంగా మత్స్య సంపదను దోచుకుంటున్నారని మరోకరి ఆరోపణలు. ఇలా ఇరువర్గాల మధ్య నడుస్తున్న వివాదం ఛేజింగ్​ వరకు వెళ్లింది.

సముద్రంలో ఛేజింగ్

ఇదీ చదవండి: జిల్లా మత్స్యశాఖకు చేరిన చేపల వేట వివాదం.. సామరస్యంగా పరిష్కరిస్తామన్న జేడీ

Last Updated : Dec 3, 2020, 5:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.