విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను నిరసిస్తూ.. అఖిలపక్షం ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లాలో బంద్ ప్రశాంతంగా జరిగింది. విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ జిల్లా కన్వీనర్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నేతలు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం పోస్కో సంస్థతో చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని.. విశాఖ పరిశ్రమను ప్రైవేటీకరణ చేయడాన్ని విరమించుకోవాలని కోరారు.
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కనిగిరిలో సీపీఎం, సీపీఐ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో బంద్, ర్యాలీ ప్రశాంతంగా నిర్వహించారు. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. పట్టణంలోని ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలు, కార్యాలయాలను మూయించారు.
ఇదీ చదవండి: