ETV Bharat / state

rape: 15 ఏళ్ల కూతురిపై తండ్రి అత్యాచారం.. - prakasham district crime news

కన్న బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన తండ్రే.. ఆమె పాలిట కీచకుడిలా మారాడు. మృగంగా మారి కన్నకూతుర్ని చెరబట్టాడు. 15 సంవత్సరాల కుమార్తెపై పలుమార్లు అత్యాచారం చేసి గర్భవతిని చేశాడు. అత్యంత హేయమైన ఈ ఘటన ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది.

father raped  15 years old girl at prakasham district

author img

By

Published : Jul 19, 2021, 4:12 PM IST

కన్న తండ్రే కూతురిపాలిట మృగంగా మారాడు. అలనా పాలనా చూసుకోవలసిన వాడే ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. కన్నబిడ్డ జీవితాన్ని చిదిమేశాడు. ప్రకాశం జిల్లాలో బెస్తవారపేట మండలంలోని ఓ గ్రామంలో బాలికపై (15) కన్న తండ్రే పలుమార్లు అత్యాచారం చేసి.. గర్భవతిని చేశాడు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

నిందితుడు ఉరికి దూరంగా ఇల్లు కట్టుకుని నివసిస్తున్నాడు. ఒక రోజు బాలిక తల్లి నిత్యావసర సరుకుల కోసం పక్క గ్రామానికి వెళ్లగా ఇంట్లోనే మద్యం మత్తులో ఉన్న తండ్రి.. బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఈ విషయం ఎవరికైనా చెప్తే తల్లితో పాటు బాలికను చంపేస్తానని బెదిరించాడు. పలు దఫాలుగా బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

ఒక రోజు తండ్రి బాలికను బాగా కొట్టగా.. 100 నెంబర్​కి ఫోన్ చేసి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులకు విషయం తెలియకపోవడంతో నిందితుడిని హెచ్చరించి వదిలేసారు. ఆ బాలికను తన తాత వచ్చి తీసుకువెళ్లాడు. బాలిక వాళ్లకు జరిగిన విషయం చెప్పి బోరున ఏడ్చింది. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయటంతో.. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఇదీ చదవండి: TWINS MURDER: కవలల హత్యకేసు: కన్నతండ్రే కాలయముడు !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.