వ్యవసాయ మోటార్లకు మీటర్ల బిగింపు ద్వారా రైతుపై ఎలాంటి భారం పడబోదని విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ ఉచిత వ్యవసాయ విద్యుత్ పథకం అమలుపై శుక్రవారం ఒంగోలులో జరిగిన సమావేశంలో ఆయన, మరో మంత్రి ఆదిమూలపు సురేష్ పాల్గొన్నారు. విద్యుత్ నగదు బదిలీ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించనున్నామన్నారు.
30 సంవత్సరాలపాటు ఉచిత విద్యుత్ పథకాన్ని నిరాటంకంగా కొనసాగిస్తాం. దీనికోసం 10 వేల మెగావాట్ల సామర్థ్యంతో సోలార్ పవర్ ప్రాజెక్ట్ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తుంది. వ్యవసాయ బోర్లకు మీటర్లు బిగించడం ద్వారా నాణ్యమైన విద్యుత్ అందుతుంది- బాలినేని శ్రీనివాసరెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
ఇదీ చదవండి