రాష్ట్రాల్లో కురిసిన వర్షాలకు శ్రీశైలం నాగార్జునసాగర్ జలాశయాల్లో నిండుగా నీరు చేరడం ఇదే ప్రథమం అని..రైతుల కళ్లల్లో నూతన ఉత్సాహం వెల్లివిరిసింది. ప్రకాశం జిల్లా త్రిపురాంతకం గ్రామంలో ఈ ఏడాది అయిన సాగుకు నీరు విడుదల చేస్తారా లేదా అన్న అంశంపై అధికారులు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వలేదు. కాలువల నిండా నీరు ప్రవహిస్తున్న సాగుకు వాడలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2015 నుంచి 2017 వరకు సాగు నీరు రాకపోవడంతో ఆయకట్ట రైతులు నానా అవస్థలు పడ్డారు. గత ఏడాది కన్నా ఈ ఏడాది ప్రాజెక్టుల్లో నీటి లభ్యత ఎక్కువ ఉండటంతో సాగుకు నిరివ్వాలని రైతులు కోరుతున్నారు.
ఇదీ చదవండి:పంటను నశనం చేస్తున్న కత్తెర పురుగు