ప్రకాశం జిల్లా అద్దంకి పట్టణంలో ఎక్సైజ్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో భాగంగా పట్టణం నుంచి మేదరమెట్ల వైపు వెళ్తుండగా కొంగపాడు డొంక వద్ద 18 మద్యం సీసాలు, ఓ ద్విచక్ర వాహనానాన్ని స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఇద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పట్టణంలో తనిఖీలు చేపట్టినట్లు అధికారులు వివరించారు.
ఇదీ చదవండి.. కన్నవారు దూరమైనా.. నిస్సహాయ స్థితిలో ప్రవాసాంధ్రులు!