అనర్హుల చేతుల్లో ఉన్నా తెల్లరేషన్ కార్డులను ఏరివేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. దీనికి గాను అనర్హుల జాబితాను రూపొందించి సచివాలయలకు పంపారు. ఈ జాబితాలపై అభ్యంతరలు ఉంటే రెండు రోజుల్లో తెలియజేయాల్సి ఉంది. విద్యుత్ బిల్లు నెలకు 300 యూనిట్లు లేదా రూ.1200 లు దాటినా... జీవనోపాధి మినహా ఇతరత్రా నాలుగు చక్రాల వాహనాలున్నా, మెట్ట మాగాణి కలిపి కుటుంబానికి పదెకరాల కన్నా ఎక్కువ కలిగి ఉన్నా రేషన్ కార్డు రద్దు అవుతుంది. ఆదాయపు పన్ను కడుతున్న వారు కూడా అనర్హుల జాబితాలో చేరుతారు. యర్రగొండపాలెం మేజర్ పంచాయతీలోని 4 సచివాలయాల పరిధిలో 600 కార్డులు అనర్హత జాబితాలో చేరాయి. ఉన్నతాధికారుల నుంచి వచ్చిన జాబితాలను సచివాలయంలో ప్రచురించారు.
ఇవీ చూడండి...