పదో తరగతి పరీక్షల పూర్తి షెడ్యూల్ను వారంలోగా ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి ఆదిములపు సురేష్ అన్నారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మురారిపల్లిలోని ఆదర్శ పాఠశాల పనులను ఆయన పరిశీలించారు. నాడు నేడు పథకం కింద రాష్ట్రంలో మొదటి విడతగా 15 వేల 700 పాఠశాలలను ఎంపిక చేసినట్టు చెప్పారు. రెండేళ్లలో పాఠశాలల రూపు రేఖలు మార్చేందుకు మొదటి విడతగా రూ. 3700 కోట్లు కేటాయించమన్నారు.
ఈ 15 వేల పాఠశాలల్లో 30 కి పైగా నమూనా పాఠశాలలుగా ఎన్నుకున్నట్టు తెలిపారు. ప్రకాశం జిల్లా యర్రగొండపాలెం మండలం మురారిపల్లి, ఒంగోలు లోని బాలాజీ నగర్ లో ఒక్కొక్కటి చొప్పున రెండు పాఠశాలు ఉన్నాయని చెప్పారు. విడతల వారీగా రాష్ట్రంలో ఉన్న పాఠశాలలను ఆధునీకరణ చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాబోయ్ రోజుల్లో ఇంటర్, డిగ్రీ కళాశాలలకు కూడా నాడు నేడు వర్తింపచేస్తామన్నారు.
త్వరలో పాఠశాలు పునః ప్రారంభం కానున్న నేపధ్యంలో జగనన్న విద్యా కానుక కింద... ప్రతి ఒక్క విద్యార్థికి స్కూల్ బ్యాగ్, మూడు జతల యూనిఫామ్లు, బూట్లు, బెల్టులు, పుస్తకాలతో పాటు రూ. 15 వందల విలువ గల్ కిట్లను పంపిణీ చేయనున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి: