ETV Bharat / state

'వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం' - education commissioner talks about nadu nedu flagship programme

పాఠశాల విద్యలో సమూల మార్పుల తీసుకువచ్చేందుకు సంస్కరణలు చేపడుతున్నామని ఒంగోలులో పర్యటించిన పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్​ అన్నారు.

'వచ్చే ఏట నుంచి పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు'
author img

By

Published : Nov 8, 2019, 11:54 PM IST

'వచ్చే ఏట నుంచి పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం అమలు'

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఈ నెల 14న నాడు-నేడు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి ప్రారంభిస్తారని పాఠశాల విద్యా ముఖ్య కార్యదర్శి బి. రాజశేఖర్​ అన్నారు. పాఠశాల విద్యలో సమూల మార్పులు తీసుకువచ్చేందుకు విద్యాబోధనల్లో సంస్కరణలు చేపడుతున్నామని తెలిపారు. నాణ్యమైన విద్యతో పాటు, పాఠశాలల్లో సకల సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 8వ తరగతి వరకూ ఆంగ్లమాధ్యమంలోకి అడుగిడుతున్నామన్నారు. 2021-22లో 9వ తరగతి, 2022-23లో 10వ తరగతిలో ఆంగ్లంను ప్రవేశ పెట్టనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 45వేల పాఠశాలల్లో మొత్తం ఆంగ్లంలో బోధన నిర్వహిస్తామన్నారు. అదే విధంగా వచ్చే ఏడాది 1 నుంచి 5 వరకూ పాఠ్యపుస్తకాలు కూడా మారుస్తున్నామని అన్నారు. ఒక్కసారిగా మాధ్యమంలోకి మారడం వల్ల తలెత్తే ఇబ్బందులను అధిగమిస్తామని, తమిళనాడులో కూడా ఆంగ్లమాధ్యమానికి మారారని, అక్కడ ఉపాధ్యాయులకు ఇచ్చిన శిక్షణను మోడల్​గా తీసుకుని జనవరి నుంచి రాష్ట్రంలో ఉన్న 90 వేల మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తామని రాజశేఖర్​ అన్నారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా రానున్న మూడేళ్లలో 10 వేల కోట్ల రూపాయలతో 45వేల పాఠశాలలను అభివృద్ధి పరుస్తామన్నారు.

ఇదీ చదవండి :

'మూడేళ్లు.. మూడు దశలు.. నాడు-నేడు కార్యక్రమం'

sample description

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.