ప్రకాశం జిల్లా కనిగిరి మండలం చల్లగిరిగల గ్రామంలోని రైతులు కరివేపాకును విస్తారంగా సాగు చేస్తున్నారు. ఈ పంటను స్థానికంగా ఉన్న కనిగిరితో పాటు, ఒంగోలు, విజయవాడ, హైదరాబాద్, తదితర మార్కెట్లకు తరలిస్తుంటారు. అయితే, కరోనా దెబ్బతో రవాణా స్తంభించిపోవడంతో కరివేపాకు రైతులకు నష్టాల తిప్పలు తప్పడం లేదు. ఎకరాకు రూ.40,000/- పెట్టుబడి పెట్టామని, తీరా పంట చేతికొచ్చే సమయంలో కష్టం కరోనా రూపంలో ముంచుకొచ్చిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం గిట్టుబాటు ధర కూడా రావట్లేదని శ్రమ జీవులు వాపోతున్నారు. లాక్డౌన్ వల్ల రవాణా స్తంభించిపోవటంతో కరివేపాకు తోటల్లోనే మగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఇవీ చూడండి:మైనర్‌కు 66 ఏళ్ల బాషా ప్రేమలేఖ- చివరకు...