ఇదిగో ఇక్కడ పైన వీడియోలో చూస్తుంటే ఏమనిపిస్తోంది? అదేదో క్రికెట్ స్టేడియం అనో లేకుంటే అక్కడేదో జాతరో జరుగుతుంది అనుకుంటే.. మీరు కరెంట్ తీగను తొక్కినట్లే. అర్ధరాత్రి కూడా పట్టపగలును తలపిస్తున్న ఆ ప్రాంతం.. రైతు ప్రాణంగా చూసుకునే పొలం. విద్యుత్ కాంతులతో వెలిగిపోతున్న ఈ ప్రాంతమంతా పొలమే. గత రెండేళ్లుగా డ్రాగన్ ఫ్రూట్‌ను సాగు చేస్తున్న ఆ రైతు.. మరిన్ని లాభాలు అర్జించేందుకు పొలం అంతా ఇలా విద్యుత్ కాంతులు వికసింపజేశాడు.
ప్రకాశం జిల్లా దర్శి మండలం చలివేంద్రం గ్రామంలో శ్రీనివాస రెడ్డి అనే యువ రైతు మొదట ఒక ఎకరాలో డ్రాగన్ ఫ్రూట్ సాగు చేశాడు. ప్రస్తుతం అతను మరో 2.5 ఎకరాలకు ఈ డ్రాగన్ పంటను విస్తరించాడు. ఎక్కువగా పగటిపూట పెరక చూపే ఈ డ్రాగన్ ఫ్రూట్.. మన దేశంలో ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు కాపు కాస్తుంది. నవంబర్ నుంచి మార్చి వరకు చలికాలం కావటంతో.. ఆయా సమయంలో పగటి ఉష్ణోగ్రతలు తక్కువగా ఉంటాయి కాబట్టి.. కాపు పెద్దగా సహకరించదు.
రోజుకు 14 గంటలు ఉష్ణోగ్రతను పంటకు అందించినట్లైతే.. చలి కాలంలోనూ డ్రాగన్ ఫ్రూట్‌ను పండించవచ్చు అని గుర్తించిన రైతు శ్రీనివాస్ రెడ్డి.. కొన్ని పరిశోధనల చేసి.. ఆశించిన ఫలితాన్ని పొందగలిగాడు. ఎల్ఈడీ బల్బుల సహాయంతో ఆర్టిఫిషియల్ ఉష్ణోగ్రతను చెట్లకు అందించి మనదేశంలో రెండో పంట పండిస్తున్నాడు.
సాధారణ సమయాల్లో వచ్చిన దిగుబడి కంటే తగ్గినప్పటికీ.. ధరల వ్యత్యాసంతో లాభాల్లో ఎలాంటి మార్పు ఉండదంటున్నాడు ఆ రైతు. మామూలు సమయంలో కేజీ డ్రాగన్ ఫ్రూట్ ధర 200 నుంటి 250 ఉంటే.. చలికాలంలో 300 నుంచి 350 వరకు పలుకుతుందంటున్నాడు.
ఇవీ చూడండి: