ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలోని రైలు పట్టాల కింద.. ప్రజలు రాకపోకలు సాగించుకునేందుకు అండర్ పాస్ సౌకర్యం ఏర్పాటు చేశారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు అండర్ పాస్లో నీరు చేరడంతో.. ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.
దొనకొండ గ్రామం రైలు పట్టాలకు ఇరువైపులా ఉంటుంది. గతంలో రైలు ప్రయాణాలు సాగుతున్న సమయంలో.. గేటు వేసేవారు. ప్రజలు గేటు తీసిన తరువాత రాకపోకలు సాగించేవారు. ఇటీవల ప్రజల రాకపోకలకు రైల్వే అధికారులు పట్టాల కింద అండర్ పాస్ నిర్మించారు. రెండు రోజుల క్రితం కురిసిన వర్షాలకు అండర్ పాస్ నిండా మోకాళ్లలోతు నీళ్లు చేరటంతో.. ప్రజలు పట్టాలపై రాకపోకలు సాగిస్తున్నారు. రాబోయే రోజుల్లో వర్షాలు కురిసి రైళ్ల రాకపోకలు కొనసాగితే.. మా పరిస్థితి ఏంటని స్థానికులు ప్రశ్నించారు. ఇప్పటికైనా రైల్వే అధికారులు గమనించి పరిస్థితిని చక్కదిద్దాలని ప్రజలు కోరుతున్నారు.
ఇదీ చదవండి:
పేకాట కోసం ఇంటిని అమ్మేసిన భర్త... కుమార్తెతో కలిసి భార్య ఆత్మహత్య!