లాక్డౌన్ కారణంగా ప్రకాశం జిల్లా దర్శిలోని వ్యవసాయ కూలీలకు కనీస అవసరాలు కూడా తీరటం లేదు. ఈ మేరకు సీపీఎం పార్టీ, పట్టణంలోని వాసవి జ్యూయలరీ యజమాని కలిసి పేదలను ఆదుకోడానికి ముందుకు వచ్చారు. బియ్యం, కూరగాయలు, నూనె ప్యాకెట్లు పంపిణీ చేశారు. దర్శి డీఎస్పీ ప్రకాశరావు చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఇదీ చదవండి: కరోనా భయం: గ్యాస్ సిలిండర్లను భద్రపరచుకుంటున్న జనం